బ్లాక్‌ ఫంగస్‌ మందు పంపిణీ విధానాన్ని రూపొందించండి

తాజా వార్తలు

Published : 01/06/2021 00:32 IST

బ్లాక్‌ ఫంగస్‌ మందు పంపిణీ విధానాన్ని రూపొందించండి

కేంద్రం, కేజ్రీవాల్‌ సర్కారుకు దిల్లీ హైకోర్టు సూచన

దిల్లీ: దేశంలో రోజురోజుకు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నివారించేందుకు వినియోగించే యాంఫోటెరిసిన్‌-బి ఔషధం పంపిణీకి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కేంద్రం, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వాలకు దిల్లీ హైకోర్టు సూచించింది. ఈ ఔషధం కొరత ఉన్నంత వరకు పంపిణీకి నిర్దిష్ట వయసు వారిని మినహాయిస్తూ కఠిన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మందును ఇచ్చే నిర్ణయాధికారాన్ని వైద్యులకు వదిలేయొద్దని తెలిపింది. 80 ఏళ్లు, 35 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతుండగా కేవలం ఒక డోసే అందుబాటులో ఉంటే.. ఆ మందును ఎవరికి ఇవ్వాలో తెలపాలంటూ ఓ ఉదాహరణను వివరించింది. అయితే ఏ వ్యక్తి ప్రాణమైనా మరో వ్యక్తి కంటే తక్కువని చెప్పడం తమ  ఉద్దేశం కాదని న్యాయమూర్తులు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితమూ ప్రధానమేనని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని