HYD: కప్పు టీ ₹1,000.. అదీ హైదరాబాద్‌లో!

తాజా వార్తలు

Published : 16/10/2021 06:43 IST

HYD: కప్పు టీ ₹1,000.. అదీ హైదరాబాద్‌లో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా టీ ధర ఎంత ఉంటుంది. పది రూపాయలు. ఖరీదైన కేఫ్‌ల్లో అయితే టీ ధర వందల్లోనూ ఉంటుంది. కానీ, తాజాగా హైదరాబాద్‌లోని ఓ కేఫ్‌ కప్పు టీని రూ. వెయ్యికి విక్రయిస్తోంది. కప్పు టీకి అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా? అది అరుదైన టీ పౌడర్‌తో తయారు చేస్తోన్న టీ అండి మరి..!

నీలోఫర్‌ కేఫ్.. హైదరాబాదీలకు సుపరిచితమైన చోటే. ఇక్కడ అనేక రకాల టీలు, బిస్కెట్స్‌ను విక్రయిస్తుంటారు. కాగా.. ఇప్పుడు బంజారాహిల్స్‌లోని కేఫ్‌ బ్రాంచ్‌లో ప్రత్యేకమైన, ఖరీదైన టీని పరిచయం చేస్తున్నారు. ఈ టీని గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్‌తో తయారు చేస్తారట. ఈ అరుదైన టీ పౌడర్‌ను కేఫ్‌ యాజమాన్యం వేలంలోపాటలో గెలుచుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేజీన్నర గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్‌ను అసోంలో నిర్వహించిన వేలంలో కేజీ రూ.75వేల చొప్పున కొనుగోలు చేశారు. ప్రత్యేకమైన, అరుదైన రుచిని కస్టమర్లు ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే ఈ టీని పరిచయం చేస్తున్నామని కేఫ్‌ యాజమాన్యం చెబుతోంది. మీకు ఆ టీ రుచి చూడాలని ఉందా..? మరెందుకు ఆలస్యం ఈ స్పెషల్‌ టీ ఆఫర్‌ ముగియకముందే వెళ్లి తాగేయండి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని