ఎక్కువసేపు కూర్చుంటున్నారా? ప్రమాదకరమండీ..!

తాజా వార్తలు

Updated : 14/08/2021 16:03 IST

ఎక్కువసేపు కూర్చుంటున్నారా? ప్రమాదకరమండీ..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే వీపు, నడుము, కాళ్లు నొప్పి పెడతాయి. శారీరక శ్రమ లేకపోవడంతో బరువు పెరుగుతారు. కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేసే చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలే ఇవి. అయితే, అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నొప్పి, బరువు పెరగడమే కాదు.. గుండె జబ్బు, క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశముందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఎక్కవ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ మేరకు ఒక నివేదికను రూపొందించారు. 

* ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడకకు ప్రధానమైన కాళ్ల కండరాలు బలహీనపడతాయి. దీంతో కింద పడ్డా.. వ్యాయామం చేసే సమయంలో కాళ్లకు చిన్న దెబ్బ తగిలినా కండరాలు మరింత క్షీణిస్తాయట. దీంతో నడవడానికి కాళ్లు సహకరించక చచ్చుబారిపోతాయని పరిశోధకులు తెలిపారు.

* కండరాల కదలిక.. మనం తీసుకునే ఆహారం జీర్ణం అవడంలో దోహదపడుతుంటుంది.  కానీ, శారీరానికి ఎలాంటి పని చెప్పకుండా కూర్చొనే ఉంటే.. కండరాల కదిలిక లేక ఆహారం సరిగా జీర్ణం అవదు. దీంతో కొవ్వు, గ్లూకోజ్‌ శరీరంలో అధిక మొత్తంలో నిల్వ ఉండిపోతాయి. ఆ కొవ్వు రక్తనాళాలకు అంటుకుపోయి.. రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీంతో గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరగక.. గుండె జబ్బులు లేదా గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. 

* గంటలతరబడి కూర్చోవడం ద్వారా శరీరంలో పలు రకాల క్యాన్సర్‌లు అభివృద్ధి అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్దపేగులో క్యాన్సర్‌ రావొచ్చని వెల్లడించారు. 

మరి ఏం చేయాలి?

వీలైనంత ఎక్కువగా నిలబడటానికి ప్రయత్నించండి. కూర్చొని పనిచేస్తున్నా.. ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకొని నిలబడండి. ఫొన్‌ మాట్లాడాల్సి వచ్చినప్పుడు అటుఇటు నడుస్తూ మాట్లాడండి. టీవీ చూస్తే.. నిలబడి చూడండి. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగుల ఇంట్లో కార్యాయాలయాల్లో ఉండే డెస్క్‌లు ఉండవు. కాబట్టి ల్యాప్‌టాప్‌ను ఎత్తులో పెట్టుకొని నిలబడి పనిచేయడానికి ప్రయత్నించండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని