Anandayya: మీ గొడవల్లోకి నన్ను లాగవద్దు

తాజా వార్తలు

Updated : 05/06/2021 23:13 IST

Anandayya: మీ గొడవల్లోకి నన్ను లాగవద్దు

నెల్లూరు: కృష్ణపట్నంలో తయారు చేసిన మందుతో ఎమ్మెల్యే కాకాణి భారీ వ్యాపారానికి ప్రణాళిక సిద్ధం చేశారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఆనందయ్య స్పందించారు. కాకాణికి, వెబ్‌సైట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మందు పంపిస్తా. రాజకీయాల్లోకి, మీ గొడవల్లోకి నన్ను లాగవద్దని ఆనందయ్య కోరారు.
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సెశ్రిత కంపెనీ ఆనందయ్య మందు పేరుతో వెబ్‌సైట్‌ తయారు చేసిందని, ఆ కంపెనీ నిర్వాహకులు ఎమ్మెల్యే కాకాణి, వైకాపాకు అత్యంత సన్నిహితులని వెల్లడించారు. నకిలీ మద్యం తరహాలోనే నకిలీ వెబ్‌సైట్‌ రూపకల్పన జరిగిందని సోమిరెడ్డి అన్నారు. ఆనందయ్య ఔషధం ఒక్కో ప్యాకెట్‌ 167 రూపాయలకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని