నెలాఖరులో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం

తాజా వార్తలు

Updated : 18/06/2021 17:18 IST

నెలాఖరులో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం

హైదరాబాద్‌: ఈ నెలాఖరు నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26, 28 తేదీల్లో, జులై 1, 4 తేదీల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు. అంబేడ్కర్‌ నగర్‌ పీవీ మార్గ్‌లో 330, జీవైఆర్‌ కాంపౌండ్‌లో 180, పొట్టి శ్రీరాములు నగర్‌లో 162, గొల్లకుర్మయ్య కాలనీలో 10 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను జీహెచ్‌ఎంసీ దశలవారీగా లబ్దిదారులకు అందించనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని