తాగేసి.. ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ కిటికిలో ఇరుక్కుపోయి 

తాజా వార్తలు

Published : 06/08/2021 01:43 IST

తాగేసి.. ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ కిటికిలో ఇరుక్కుపోయి 

ఆ తరువాత ఏం జరిగిందంటే

(Source: Kherson Region Police)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి వరకూ సినిమాల్లోనే  హీరో.. హీరోయిన్‌ కోసం ఆమె ఇంటి బాల్కనీలోకి వెళ్లి రహస్యంగా కలుసుకునే ప్రయత్నం చేయడం చూసుంటారు.  నిజజీవితంలో అలా జరగడం అరుదు. కానీ ఉక్రెయిన్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇక విషయానికి వస్తే.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నేళ్లు కొనసాగిన వారి ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పడింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రియుడు మద్యానికి అలవాటు పడ్డాడు. మదిలో ప్రేమికురాలి ఆలోచనలే వెంటాడాయి. ఎలాగైనా తనని కలిసే ప్రయత్నం చేశాడు. ఆమెను నేరుగా కలిసే దారులన్నీ మూసుకుపోయాయి. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనే తాపత్రయం పెరిగింది. ఇక ఫుల్‌గా మందుకొట్టి ఏం చేయాలో అని ఆలోచించాడు. అంతే తన ప్రియురాలి ఇంటి కిటికిలోకి ఎవరికి తెలియకుండా ప్రవేశించాడు. మళ్లీ ప్రేమించుకుందాం రా అని ఆమెను వేడుకోవాలనుకున్నాడు. ప్రాణాన్ని పణంగా పెట్టినా అతడి ప్లాన్ బెడిసికొట్టింది. అసలే మందుకొట్టి.. మద్యం మత్తులో ఉన్న అతడు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కిటికిలో ఇరుక్కుపోయాడు. ఈలోపు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని చూసిన ఆమె విస్తుపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చేవరకు అతడు ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని కిటికి నుంచి బయటకు తీసేందుకు గంటల సమయమే పట్టింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించిన అనంతరం.. పెద్దగా గాయాలు కాలేదు కానీ త్వరగా తీసుకురాకుండా ఉంటే కిటికిలో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలుపోయే పరిస్థితి ఏర్పడేదన్నారు. ఇక ప్రియురాలి కోసం ఇంతలా తెగించిన ఆ ప్రియుడిని.. మళ్లీ ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చినందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలా ఆ బ్రేక్‌ స్టోరీ కిటికి నుంచి జైలు మెట్లు ఎక్కేలా చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని