తెలంగాణలో ‘ఎర్లీబర్డ్‌’ గడువు పొడిగింపు

తాజా వార్తలు

Published : 02/05/2021 01:32 IST

తెలంగాణలో ‘ఎర్లీబర్డ్‌’ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: ముందస్తు ఆస్తి పన్ను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్‌ పథకం గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు గడువును పొడిగిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం గడువును మే 31 వరకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక ఏడాదికి ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ పథకంలో భాగంగా 5 శాతం రాయితీ వర్తించనుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎర్లీబర్డ్‌ అమల్లో ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని