తమిళనాడులో రూ. 5 కోట్లు: రంగంలోకి ఈడీ
close

తాజా వార్తలు

Published : 27/07/2020 13:50 IST

తమిళనాడులో రూ. 5 కోట్లు: రంగంలోకి ఈడీ

అమరావతి: తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో రూ.5.27 కోట్లు లభించడం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఐటీ శాఖ విచారణ చేపట్టింది. అయితే తాజాగా ఈ ఘటనపై విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను కేసుకు సంబంధించిన వివరాలు కోరింది. చెన్నైలో ఎవరికి ఇచ్చేందుకు ఈ నగదు తరలిస్తున్నారనే అంశంపై ఆరా తీస్తోంది. 

ఇటీవల చెన్నై పోలీసులు ఎలావూరులోని చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఆ వైపుగా వచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారును ఆపి తనిఖీ చేశారు. వెనుక సీట్లో ఉన్న నాలుగు సంచుల్లో రూ.5.27 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్‌, వసంత్‌, కారు డ్రైవరు సత్యనారాయణన్‌లను అరెస్టు చేశారు. నగదును ఐటీ అధికారులకు అప్పగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని