Viral: ఇది ‘అత్యంత ఎత్తైన’ వ్యాపార ప్రకటన.. ఏ సంస్థదో తెలుసా..?

తాజా వార్తలు

Published : 11/08/2021 01:51 IST

Viral: ఇది ‘అత్యంత ఎత్తైన’ వ్యాపార ప్రకటన.. ఏ సంస్థదో తెలుసా..?

దుబాయ్‌: వ్యాపారమంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా వస్తుసేవలు అందించడం ఒక్కటే కాదు.. వినూత్నంగా వాటిని ప్రజల చెంతకు చేర్చాలి. పోటీ సంస్థల్ని తలదన్నేలా ప్రకటనలు ఇవ్వడమూ అంతే కీలకం. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఆ విషయంలో ఆకట్టుకుంది. తన ఆలోచనతో వావ్‌ అనిపించింది. ఆ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ యాడ్‌ను రూపొందించేందుకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవన నిర్మాణం బూర్జు ఖలీఫాను ఎంచుకోవడం వీక్షకులను విపరీతంగా మెప్పించింది.

ఆ ప్రకటనలో ఒక ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ నికోలే ఎమిరేట్స్ క్యాబిన్‌ క్రూగా నటించారు. ఆమె బూర్జు ఖలీఫా పైకొనపై నిల్చొని.. ఎమిరేట్స్‌లో ప్రయాణం గురించి వివరించారు. దానికి సంబంధించిన మెసేజ్‌ బోర్డుల్ని ప్రదర్శించారు. ‘యూకే అంబర్ జాబితాలోకి యూఏఈ చేరిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న భావన కలుగుతోంది. ఎమిరేట్స్‌లో సురక్షితంగా ప్రయాణించండి’ అన్నది ఆ ప్రకటన సారాంశం. అలాగే ఆ తర్వాత కెమెరా ఆమెకు దూరంగా జరుగుతున్నప్పుడు ఆ ఎత్తైన ప్రాంతం నుంచి దుబాయ్ అందాలు అదరహో అనిపిస్తాయి.

నికోలే కూడా ప్రకటన గురించి తన అనుభవాల్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘ఇది నేను చేసిన అత్యద్భుతమైన విన్యాసం. మీ సృజనాత్మక మార్కెటింగ్‌కు జోహార్’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ యాడ్‌ను ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్‌ లేకుండా తీసినట్లు ఎమిరేట్స్‌ వెల్లడించింది. కొవిడ్ కారణంగా యూకే ప్రయాణ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం రెడ్‌ లిస్ట్‌లో ఉన్న దేశాల జాబితాను అంబర్ స్థాయికి తగ్గించింది. దానికి కృతజ్ఞతగా యూఏఈ దీన్ని రూపొందించింది.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని