పిల్లిని కాపాడబోయి.. చెట్టుపై ఇరుక్కున్న యువకుడు

తాజా వార్తలు

Published : 01/07/2021 01:20 IST

పిల్లిని కాపాడబోయి.. చెట్టుపై ఇరుక్కున్న యువకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెంపుడు జంతువుల పట్ల కొందరు యజమానులు ఎంతో ఉదారతతో వ్యవహరిస్తుంటారు. వాటికి చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోతారు.  ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాపాడటానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే పనిచేశాడు అమెరికాలోని ఓ యువకుడు. తాను పెంచుకుంటున్న పిల్లి తన ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు ఎక్కింది. చెట్టుమీద నుంచి దిగలేక పిల్లి అవస్థలు పడటంతో.. దాన్ని రక్షించడం కోసం యువకుడు కూడా చెట్టెక్కాడు. చెట్టయితే ఎక్కాడు కానీ, దిగడానికి మాత్రం భయపడ్డాడు. దాంతో అగ్నిమాపక సిబ్బందికి కబురుపెట్టాడు. వాళ్లు వచ్చి భారీ నిచ్చెనల సాయంతో పిల్లిని, ఆ యువకుడినీ సురక్షితంగా చెట్టు మీదనుంచి కిందికి దించారు. కాగా తమ సిబ్బందిని అభినందిస్తూ అమెరికా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు దీనికి సంబంధించిన వీడియోను తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని