కొనసాగుతున్న తుది దశ పంచాయతీ పోరు

తాజా వార్తలు

Updated : 21/02/2021 07:42 IST

కొనసాగుతున్న తుది దశ పంచాయతీ పోరు

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం  6.30 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోగల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే మూడు దశల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. 
తుది దశలో 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా  554 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవాళ పోలింగ్‌ జరిగే 2,743 సర్పంచి స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండు చోట్ల సర్పంచి స్థానాలకు, 91 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ దశతో రాష్ట్రంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తవుతాయి.

సమస్యాత్మక ప్రాంతాల్లో 38% పోలింగ్‌ కేంద్రాలు

నాలుగో దశ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 28,995 పోలింగ్‌ కేంద్రాల్లో 38 శాతం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. 6,047 పోలింగ్‌ కేంద్రాలు సమస్మాత్మక, మరో 4,967 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణ, పర్యవేక్షణ, ఓట్ల లెక్కింపు కోసం 96 వేల మంది అధికారులు, ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు, ఎక్కడైనా లోపాలుంటే గుర్తించి వెంటనే సరి చేసేలా వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో చిత్రీకరించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని