చిలుక అరుపులకు ఇంటికొచ్చిన పోలీసులు!

తాజా వార్తలు

Updated : 07/01/2020 10:22 IST

చిలుక అరుపులకు ఇంటికొచ్చిన పోలీసులు!

వాషింగ్టన్‌: పొరుగింటి నుంచి ‘హెల్ప్‌.. హెల్ప్‌’ అరుపులు విన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఇంటికొచ్చారు. తీరా విషయం తెలుసుకుని  వెనుదిరిగారు. సాయం కోసం అరిచింది మహిళ కాదు.. ఓ చిలుక అని తెలుసుకున్న తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇటీవల జరిగిందీ ఘటన.

ఓ వ్యక్తి ఇంటి ముందు తన కారును రిపేర్‌ చేస్తుండగా పోలీసులు వచ్చారు. ఇంటి నుంచి మహిళ అరుపులు వినిపించాయని ఫిర్యాదు అందిందని తెలిపారు. వారు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఆ అరుపులు కొనసాగుతున్నాయి. దీంతో సదరు వ్యక్తి అసలు విషయం చెప్పేందుకు ఇంట్లోకి వెళ్లాడు. ఏళ్లుగా పెంచుకుంటున్న చిలుకను తీసుకొచ్చి వారి ముందుంచాడు. ఆ తర్వాత అసలు విషయం చెప్పడం మొదలు పెట్టాడు.‘‘ఈ చిలుక పేరు ర్యాంబో. నా చిన్నతనంలో దీన్నో పంజరంలో ఉంచేవారు. అప్పట్లో దానికి ‘హెల్ప్‌.నన్ను బయటకు విడిచిపెట్టండి’ అని పదాలు నేర్పించాను. కొన్నాళ్లకు దాన్ని పంజరం నుంచి విడిచిపెట్టాం. కానీ ఇది మాత్రం ఆ పదాలను మరిచిపోలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పొరుగింటి వ్యక్తి కూడా తన పనికి క్షమించాలని కోరాడు. పోలీసులు రావడం దగ్గర నుంచి వాళ్లు వెళ్లేంత వరకు జరిగిన ఘటనంతా ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియో సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని