హైకోర్టులో రజనీకి వ్యతిరేకంగా పిటిషన్‌

తాజా వార్తలు

Updated : 22/01/2020 10:25 IST

హైకోర్టులో రజనీకి వ్యతిరేకంగా పిటిషన్‌

చెన్నై: సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ద్రవిడర్‌ కళగమ్‌ సెక్రటరీ మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘పెరియార్‌ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పేరు తెచ్చుకునేందుకే ఇలా మాట్లాడారు’ అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. రజనీకాంత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ద్రవిడర్‌ కళగమ్‌ సభ్యులు రజనీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

అయితే పెరియార్‌ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. రజనీ వ్యాఖ్యలను నిరసిస్తూ ద్రవిడర్‌ కళగమ్‌ కార్యకర్తలు గత కొన్ని రోజులుగా ఆయన నివాసం ముందు ఆందోళన చేస్తున్నారు. దీనిపై రజనీ మంగళవారం స్పందిస్తూ పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యలకు గాను ఎట్టి పరిస్థితుల్లోను క్షమాపణ చెప్పనని తేల్చి చెప్పారు. దీంతో ఆయనపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని