ఏపీ అసెంబ్లీలో ‘జై అమరావతి’ నినాదాలు

తాజా వార్తలు

Updated : 22/01/2020 11:18 IST

ఏపీ అసెంబ్లీలో ‘జై అమరావతి’ నినాదాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘జై  అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తెదేపా సభ్యులు ఆందోళన చేస్తుండగానే ..మంత్రులు తమ ప్రసంగం కొనసాగించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తెదేపా సభ్యులు గందరగోళం  చేయడం తగదన్నారు. విశాఖకు రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని