బక్కచిక్కిపోయిన మృగరాజులు..!

తాజా వార్తలు

Updated : 23/01/2020 16:45 IST

బక్కచిక్కిపోయిన మృగరాజులు..!

ఖర్టోమ్‌: అడవికి రారాజు సింహం అంటారు. ఒక్కసారి జూలు విదిల్చి పంజా వేసిందంటే ఇక అంతే సంగతులు. ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలు కోల్పోవలసిందే. బలిష్టమైన శరీరం.. జూలుతో అందరినీ భయపెట్టే విధంగా ఉండే సింహాలు ఇక్కడ మాత్రం ఎముకల గూడుతో బక్కచిక్కిపోయి ఉన్నాయి. కళ్లలో జీవం లేకుండా కనీసం నడవడానికి కూడా ఓపికలేని పరిస్థితిలో ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎవరికైనా హృదయం కలిచివేయకమానదు. సూడాన్‌ రాజధాని ఖర్టోమ్‌లోని అల్‌ ఖురేషీ జంతు ప్రదర్శన శాలలో ఉన్న సింహాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 

తినేందుకు ఆహారం కూడా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం నడవడానికి కూడా ఓపిక లేక ఒక చోట కదలకుండా కూర్చున్న వాటిని చూసి జంతు ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. ఈ జంతు ప్రదర్శనశాలలో మొత్తం ఐదు సింహాలు ఉండగా అందులో ఇటీవల రెండు మృతి చెందాయి. ఇక మూడు సింహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సూడాన్‌లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడటంతో పార్క్‌లో ఉన్న సింహాలకు ఆహారం కూడా దొరకడం లేదు. దీంతో అవి సగానికిపైగా బరువు తగ్గిపోయాయి. దీనిపై జూ నిర్వాహకులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంచినీళ్లు తాగి అవి వాటి కడుపు నింపుకుంటున్నాయి. కొన్ని వారాలుగా అవి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి. సొంత డబ్బుతో తాము వాటికి ఆహారం ఏర్పాటు చేసినా అది సింహాలకు సరిపోవడం లేదని జూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్‌లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో మృగరాజులకు తినేందుకు ఆహారం కూడా లభించడం లేదు. సింహాల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. కొంతమంది వాటి కోసం మాంసం, అవసరమైన మందులు తీసుకొని ఆ పార్క్‌కు వస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని