‘సచివాలయం’ పిటిషన్‌ 12కు వాయిదా

తాజా వార్తలు

Published : 27/01/2020 20:00 IST

‘సచివాలయం’ పిటిషన్‌ 12కు వాయిదా

హైదరాబాద్‌: సచివాలయ నిర్మాణం విచారణను హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. సచివాలయ నిర్మాణం, అంచనా వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అదనపు ఏజీ రాంచందర్ రావును హైకోర్టు ఆదేశించింది. నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రాంచందర్ రావు వాదనలు వినిపించారు.

సచివాలయం నిర్మాణానికి సంబంధించిన చర్యల గురించి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయాన్ని కూల్చివేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో దీని విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదని అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. కూల్చివేత ఆపాలనే ఆదేశాలిచ్చామని, నిర్మాణానికి సంబంధించిన నమూనా రూపకల్పన, అంచనా వ్యయం విషయంలో ఎలాంటి స్టేలు ఇవ్వలేదు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. నూతన సచివాలయ నిర్మాణం కోసం రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవ్వొచ్చని అదనపు ఏజీ రాంచందర్ రావు ధర్మాసనానికి తెలిపారు. నిర్మాణ నమూనా, అంచనా వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని