రాజధాని పోరాటం: ఆగిన మరో గుండె!

తాజా వార్తలు

Updated : 28/01/2020 13:04 IST

రాజధాని పోరాటం: ఆగిన మరో గుండె!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. రాజధానిపై మనస్తాపంతోనే ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుడి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పరామర్శించారు.

మరోవైపు రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని