ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో మంత్రి హరీశ్‌రావు భేటీ

తాజా వార్తలు

Updated : 28/01/2020 14:02 IST

ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో మంత్రి హరీశ్‌రావు భేటీ

దిల్లీ: 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీలో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల శాతం, రుణపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ నిర్వహణకు నిధులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు ఇచ్చేలా చూడాలని హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖను ఆయన ఎన్‌.కె.సింగ్‌కు అందజేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని