ఘనంగా శంబర పోలమాంబ ఉత్సవాలు

తాజా వార్తలు

Published : 28/01/2020 16:39 IST

ఘనంగా శంబర పోలమాంబ ఉత్సవాలు

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి ఉత్సవాలు విజయగరం జిల్లా మక్కువ మండలం శంబరలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం సిరిమానోత్సవం. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరగనుంది. సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా శంబరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని