రాజధాని పోరు: గుండెపోటుతో మహిళ మృతి

తాజా వార్తలు

Updated : 29/01/2020 10:07 IST

రాజధాని పోరు: గుండెపోటుతో మహిళ మృతి

అమరావతి: రాజధాని కోసం మరో గుండె ఆగిపోయింది. రాజధానిని తరలిస్తున్నారని మనస్తాపానికి గురై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన భారతి (55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు ఆమె బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనల్లో భారతి పాల్గొన్నారు.

మరోవైపు రాజధాని రైతుల ఆందోళన 43వ రోజుకు చేరుకుంది. రాజధాని తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తుళ్లూరు నుంచి మరికాసేపట్లో  భారీ వాహన ర్యాలీ ప్రారంభం కానుంది. రాజధాని గ్రామాల గుండా ప్రదర్శన కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదు లింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ప్రదర్శన తిరిగి తుళ్లూరు చేరుకోనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని