19న రామ మందిర నిర్మాణ ట్రస్టు తొలి భేటీ

తాజా వార్తలు

Published : 10/02/2020 21:10 IST

19న రామ మందిర నిర్మాణ ట్రస్టు తొలి భేటీ

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై ఏర్పాటు చేసిన శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ నెల 19న తొలిసారి సమావేశం కానుంది. ట్రస్టు అధ్యక్షుడు పరాశరన్‌ నివాసంలో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 1న శ్రీరామనవమి లేదా ఏప్రిల్‌ 26న అక్షయ తృతీయ రోజున మందిర నిర్మాణ పనులు ప్రారంభించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశం కోసం ట్రస్టు సభ్యులు ఈ నెల 18వ తేదీనే దిల్లీ చేరుకోనున్నారని తెలుస్తోంది. ముఖ్యమైన రోజునే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇప్పటికే ట్రస్టు సభ్యుడు ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 5న పార్లమెంట్‌లో రామ మందిర నిర్మాణ ట్రస్టు ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ప్రముఖ న్యాయవాది పరాశరన్‌ నేతృత్వంలో శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దిల్లీలోని పరాశరన్‌ నివాసమే ట్రస్టు కార్యాలయమని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని