కరోనా వ్యాప్తి నివారణలో రోబోల వాడకం

తాజా వార్తలు

Updated : 12/02/2020 04:41 IST

కరోనా వ్యాప్తి నివారణలో రోబోల వాడకం

బీజింగ్‌: కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స చేస్తూ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ, రోగుల ఉపశమనానికి చైనా ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొంది. కరోనా రోగులకు ఆహారం, ఔషధాల సరఫరా తదితర అవసరాలకు ఆసుపత్రుల్లో రోబోల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. చైనాలోని ఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు ఆహారం, ఔషధాలను ఓ రోబో అందజేస్తున్నట్లు ఉన్న ఒక వీడియోను చైనా పత్రిక ‘పీపుల్స్‌ డైలీ’ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 360 డిగ్రీల కోణంలో ఎటువైపు అయినా కదలగల సామర్థ్యం ఉన్న ఈ రోబో, ఆసుపత్రుల్ని పూర్తిగా శుభ్రం చేసి ఇన్ఫెక్షన్లు సోకకుండా చేయగలదు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని