రాజధాని రైతుల శిరిడీ పయనం

తాజా వార్తలు

Published : 12/02/2020 13:40 IST

రాజధాని రైతుల శిరిడీ పయనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 57వ రోజుకు చేరాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై  రోజుకో రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా  రాజధాని రైతులు, మహిళలు బుధవారం శిరిడీ బయల్దేరి వెళ్లారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 200 మంది ‘జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌.. అమరావతిని రక్షించండి’ అంటూ నినాదాలు చేస్తూ శిరిడీ సాయి దర్శానికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మనసు మారాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. అమరావతి కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని