క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు

తాజా వార్తలు

Updated : 13/02/2020 15:27 IST

క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి: సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. గతేడాది మే 31 నుంచి వేతనం చెల్లించడం లేదని ఆయన పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ పిటిషన్‌లో క్యాట్‌కు తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేయాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని.. అందుకే ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన పనిచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని