సస్పెన్షన్‌పై కేంద్రానికి సమాచారమిచ్చారా?

తాజా వార్తలు

Published : 15/02/2020 00:22 IST

సస్పెన్షన్‌పై కేంద్రానికి సమాచారమిచ్చారా?

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్‌

అమరావతి : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై క్యాట్‌లో విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కేంద్రానికి సమాచారమిచ్చారా? అని క్యాట్‌ ప్రశ్నించింది. ఆయనకు వేతనం ఎందుకు చెల్లించట్లేదని అడిగింది. అయితే తమకున్న అధికారాలతోనే సస్పెండ్‌ చేశామని ఏపీ ప్రభుత్వం క్యాట్‌కు తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆదేశించింది. ఈ నెల 24న తుది విచారణ చేపడతామని క్యాట్‌ తెలిపింది.

తనను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈనెల 8న జారీచేసిన జీవో 18ను సవాలు చేస్తూ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.జీవో చట్టవిరుద్ధమని, ఏకపక్షమని, దురుద్దేశపూరితమని, పక్షపాతమని, అఖిల భారత సర్వీసు నిబంధనలు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జారీచేశారని, జీవోను కొట్టేయాలంటూ పిటిషన్‌ దాఖలుచేశారు. 30 ఏళ్ల సర్వీసులో చిన్న ఆరోపణ లేదని, పలు అవార్డులు కూడా పొందానన్నారు. 2019లో ప్రభుత్వం మారాక మే 30న తనను బదిలీ చేశారని, 31న సాధారణ పరిపాలనా విభాగానికి వెళ్లాలని ఆదేశించారన్నారు. 8 నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదని, జీతం కూడా ఇవ్వకపోవడంతో మానసిక వేదనకు గురయ్యానన్నారు. జీతం, పోస్టింగ్‌ ఇవ్వాలని పలుమార్లు కోరినా పట్టించుకోకపోవడంతో జనవరి 6న, 28న వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని