మెరుగైన రక్తప్రసరణతో జ్ఞాపకశక్తి పదిలం! 

తాజా వార్తలు

Updated : 16/02/2020 23:52 IST

మెరుగైన రక్తప్రసరణతో జ్ఞాపకశక్తి పదిలం! 

బెర్లిన్‌: జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే మెదడుకు రక్త ప్రసరణ బాగుండాలంటున్నారు జర్మనీ శాస్త్రవేత్తలు. స్పొరాడిక్‌ సెరిబ్రల్‌ స్మాల్‌ వెస్సెల్‌ వ్యాధితో బాధపడుతున్నవారిలో ఈ రక్త ప్రసరణను పెంచడం ద్వారా మేధో సామర్థ్యాలను వృద్ధి చేయొచ్చునని వారు సూచిస్తున్నారు. మానవ మెదడులో హిప్పోకాంపస్‌ అనే చిన్న భాగం ఉంటుంది. మెదడులోని రెండు అర్ధగోళాల్లో 2 హిప్పోకాంపై నిర్మాణాలుగా దాని ఉనికి కనిపిస్తుంది. జ్ఞాపకశక్తి నియంత్రణ కేంద్రంగా హిప్పోకాంపస్‌ను పరిగణిస్తారు. అల్జీమర్స్‌ వంటి వ్యాధుల బారినపడితే ఈ భాగం దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. తాజాగా జర్మనీ పరిశోధకులు 45-89 ఏళ్ల మధ్య వయసున్న 47 మందిపై అధ్యయనం చేపట్టారు. హిప్పోకాంపస్‌ భాగానికి రక్త ప్రసరణ ఎంత మెరుగ్గా ఉంటే.. వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి అంతగా బాగుంటున్నట్లు తేల్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని