వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

తాజా వార్తలు

Updated : 20/02/2020 17:10 IST

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: శివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అందిస్తోన్న ఈ సేవలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. నేటి నుంచి 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 
హైదరాబాద్ నుంచి వేములవాడ, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్ ధర రూ.30 వేలుగా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి వ్యూ పాయింట్ టికెట్‌ ధర రూ. 3 వేలు, వేములవాడ, మిడ్ మానేరు జలాశయం, పరిసర ప్రాంతాల పర్యటన టిక్కెట్‌ ధర రూ.5,500గా ఉందని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ-హైదరాబాద్ మధ్య బస్సులు కూడా నడుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలను వేయి మంది ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని