శివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైలం

తాజా వార్తలు

Published : 21/02/2020 13:09 IST

శివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైలం

శ్రీశైలం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలో స్వయంభువుగా వెలసిన మల్లికార్జునస్వామి,భ్రమరాంబికాదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్య స్నానమాచరించిన అనంతరం భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం జనసంద్రంగా మారింది. ఇవాళ సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లింగోద్భవకాల మహన్యాస రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిక్కెట్‌ విక్రయ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు. దివ్యాంగులు మహిళలు, వృద్ధుల కోసం 50 మంది పోలీసులతో సేవాదళం ఏర్పాటు చేశారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బందితో కలిపి మొత్తం 1500 మంది విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని