ఆ ఆలయాల్లోఆడవారిదే పైచేయి!
close

తాజా వార్తలు

Published : 29/02/2020 15:48 IST

ఆ ఆలయాల్లోఆడవారిదే పైచేయి!

అవన్నీ దేవాలయాలు. అక్కడ మహిళలకు మాత్రమే ప్రవేశం అట. ఆ వివరాలేంటో చూద్దామా...

అత్తుకల్‌ దేవి దేవాలయం:  తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. పార్వతి దేవి మరో అవతారంగా చెప్పుకునే కన్నకీ మాతను కొలుస్తారిక్కడ. పైగా మహిళలకే ప్రవేశం. ఫిబ్రవరి, జనవరిలో జరిగే పొంగల్‌ పండగకు లక్షలమంది హాజరవుతారు. పెద్ద ఎత్తున మహిళలు ఒకే చోట చేరి అలా చేయడంతో ఈ దేవాలయం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించుకుంది.

కుమారీ అమ్మన్‌ దేవాలయం: కన్యాకుమారిలో ఉన్న దేవాలయంలో మా భగవతీ దుర్గగా అమ్మవారిని కొలుస్తారు. యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఇదీ ఒకటిగా చెబుతారు. సతీదేవి ఖండిత భాగాల్లో ఆమె వెన్నెముక ఈ కొండపైనే పడింది. ఇక్కడా మహిళలకు మాత్రమే ప్రవేశం. అవివాహితులు, సన్యాసులకు గుడి ద్వారం వరకే ప్రవేశం.

కామాఖ్యా దేవి ఆలయం: అసోంలోని గువహటిలో కొలువై ఉంది కామాఖ్యా దేవి. నెలసరి సమయంలోనే స్త్రీలకు గుడిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇక్కడ అమ్మవారికి నెలసరి వస్తుందని నమ్మకం.  అక్కడ పూజారులూ స్త్రీలే. వీటితోపాటు కేరళలోని చక్కులాతుకవు దేవాలయం, బిహార్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఉన్న మాతా దేవాలయంలోకి కూడా పురుషులకు అనుమతి లేకపోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని