తమిళనాడు ఫేమస్‌ డ్రింకా.. మజాకా

తాజా వార్తలు

Updated : 02/03/2020 12:58 IST

తమిళనాడు ఫేమస్‌ డ్రింకా.. మజాకా

సింగపూర్‌ వెళ్తున్న జిగర్తండా

చెన్నై: మధురై అంటే ముందుగా గుర్తొచ్చేది మధుర మీనాక్షి ఆలయం, తిరుమళై నాయికర్‌ మహల్‌,  మల్లె పువ్వులు, జల్లికట్టు. వీటితోపాటు జిగర్తండా కూడా మదిలో మెదులుతుంది. ఈ పానీయం రుచి చూడటానికే కొందరు మధురై వెళ్తుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మధురై పర్యటకులను మాత్రమే ఆకర్షిస్తున్న జిగర్తండా త్వరలో సింగపూర్‌కు పయనమవుతోంది. అక్కడి ప్రజలకు  ఈ పానీయం బాగా నచ్చడంతో సింగపూర్‌కు పంపించడానికి స్థానిక దుకాణదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగపూర్‌తోపాటు ఇతర దేశాలకూ జిగర్తండా రుచి చూపించాలని ఆశిస్తున్నారు.

మిశ్రమం.. జిగర్తండా:
జిగర్తండా అంటే రకరకాల పదార్థాల మిశ్రమం. జున్ను, బసంతి ఐస్‌క్రీమ్‌ను పాలలో ఉడికించి... పాలు, సీవీడ్‌, బాదం, రెసిన్‌, నన్నారి షర్‌బత్‌ మిశ్రమానికి జోడిస్తారు. ఇదే జిగర్తండా. ఈ పానీయం సేవించడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇందులో అధికంగా విటమిన్లు, ప్రోటీన్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీంతో ఈ పానీయం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తరాది నుంచి వచ్చే పర్యటకులు, విదేశీయలు దీని రుచి చూడకుండా మధురై పర్యటన పూర్తి చేయరని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆసక్తే జిగర్తండాను త్వరలో సింగపూర్‌  తీసుకు వెళ్లనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని