ప్లీజ్‌.. ముద్దులు ఆపేయండి..!

తాజా వార్తలు

Published : 01/03/2020 21:33 IST

ప్లీజ్‌.. ముద్దులు ఆపేయండి..!

వియన్నా: భారత్‌లో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నమస్తే చెప్పి పలకరించుకోవడం అలవాటు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలకు వెళ్తే కరచాలనం ఇవ్వడం పరిపాటి. అదే స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ దేశాల్లో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పురుషులు, స్త్రీలు చెంపలపై ముద్దులు పెట్టుకుని పలకరించుకోవడం సర్వసాధారణం. అయితే ఈ విధానం కారణంగా వారికి పెద్ద చిక్కే వచ్చిపడింది. దీని వల్ల కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కొద్ది రోజులు ముద్దులు పెట్టుకోవడం ఆపేయాలంటూ ఆ దేశ ఆరోగ్య మంత్రి అలైన్‌ బెర్జెట్‌ ప్రజలకు సూచించారు. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకోకుండా ఉండటం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. కాబట్టి ఈ విధానాన్ని కొద్ది రోజులు పరిగణనలోకి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.

మరోవైపు స్విస్‌లో ఇప్పటికే ప్రజలు గుంపులుగా సమావేశమవడంపైనా నిషేధం విధించారు.  ఇప్పటివరకు అక్కడ దాదాపు 20 మందికి కరోనా సోకినట్లు సమాచారం. ఫ్రాన్స్‌లోనూ ఆరోగ్య మంత్రి ఒలివియర్‌ శుక్రవారం స్పందిస్తూ.. కరోనా కట్టడికి కరచాలనం చేసుకోవడం ఆపేయాలని ప్రజలకు సలహా ఇచ్చారు. ఈ రెండు దేశాలు కరోనా విజృంభిస్తున్న ఉత్తర ఇటలీ ప్రాంతానికి సరిహద్దులో ఉండటం గమనార్హం. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని