నియంత్రణ చర్యల్లో తెలంగాణ భేష్‌‌:హర్షవర్ధన్‌

తాజా వార్తలు

Updated : 06/03/2020 22:00 IST

నియంత్రణ చర్యల్లో తెలంగాణ భేష్‌‌:హర్షవర్ధన్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హర్షవర్ధన్‌ అభినందించారు. కరోనా వైరస్‌పై సమీక్షలో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ నియంత్రణపై హర్షవర్ధన్‌ పలు సూచనలు చేశారు. పకడ్బందీ ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని..మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని కేంద్ర మంత్రి సూచించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ తెలంగాణలో ఎన్‌-95 మాస్క్‌లను అందిండంతో పాటు రాష్ట్రంలో మరో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని హర్షవర్ధన్‌ను కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని