సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం: హరీశ్‌రావు

తాజా వార్తలు

Updated : 08/03/2020 17:32 IST

సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం: హరీశ్‌రావు

హైదరాబాద్‌: సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింహభాగం నిధులు కేటాయించింది. రూ.40వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదల జీవన భద్రతను, భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్ధాప్య పింఛను అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆసరా పింఛను లబ్ధిదారుల సంఖ్య పెరగనుండటంతో బడ్జెట్‌లో రూ.11,758 కోట్లు కేటాయించారు.

ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.16,534.97 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9,771.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.1,518.06 కోట్లు కేటాయించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కోసం ఈ బడ్జెట్‌లో రూ.1,350 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.1,200 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం రూ.2,650 కోట్లు కేటాయిచారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని