మహారాష్ట్రలో ఆలయాలు మూసివేత
close

తాజా వార్తలు

Published : 16/03/2020 19:21 IST

మహారాష్ట్రలో ఆలయాలు మూసివేత

ముంబయి: కరోనా వైరస్‌ ప్రభావంలో మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ముంబయిలోని అతి ప్రాచీన సిద్ధివినాయక ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్టు ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ గుడి తలుపులు మూసే ఉంటాయని పేర్కొంది. మహారాష్ట్రలోని మరో ప్రముఖ ఆలయం తుల్జా భవాని ఆలయం. మార్చి 17 నుంచి 31 వరకూ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు ఆలయాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జన సమూహాలను నివారించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 37 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని