ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను కొట్టివేసిన క్యాట్‌

తాజా వార్తలు

Published : 17/03/2020 11:28 IST

ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను కొట్టివేసిన క్యాట్‌

హైదరాబాద్‌: తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ సీనియరు ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ మంగళవారం తీర్పు వెలువరించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ రద్దు చేసేందుకు నిరాకరించిన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌, ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

 సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగంపై ఏపీ ప్రభుత్వం ఆయనను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలరీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని