ఒక్క విద్యార్థి.. 8 మంది సిబ్బంది

తాజా వార్తలు

Published : 19/03/2020 14:10 IST

ఒక్క విద్యార్థి.. 8 మంది సిబ్బంది

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పదో తరగతి పరీక్ష రాయడానికి ఒకే విద్యార్థి హాజరయ్యాడు. పట్టణంలోని న్యూ శాతవాహన ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలిరోజు తెలుగు పరీక్ష రాయడానికి శ్రీకాంత్‌ అనే విద్యార్థికి మాత్రమే ఈ కేంద్రాన్ని కేటాయించారు. ఒక్క విద్యార్థి కోసం ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వహించారు. పరీక్షా కేంద్రానికి సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారి, ఇన్విజిలేటర్‌, ఆరోగ్య సహాయకుడు, ముగ్గురు పోలీస్‌ సిబ్బంది, అటెండర్‌ వంటి ఉద్యోగులు విధులు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని