మహమ్మారులను దాటేస్తున్న కరోనా

తాజా వార్తలు

Published : 21/03/2020 00:53 IST

మహమ్మారులను దాటేస్తున్న కరోనా

ఎబోలాకు సమీపంలో కొవిడ్‌-19

చరిత్రలో ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి మరో మహమ్మారితో పోరాడుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని తీవ్రత ప్రపంచ యుద్ధం కంటే అధికమని భారత ప్రధాని మోదీ సైతం పేర్కొనడం గమనార్హం. దానికి కారణం కొద్ది రోజుల్లోనూ కొవిడ్‌-19 ప్రపంచమంతా వ్యాపించి 10వేల మందికి పైగా బలితీసుకుంది. సార్స్‌, మెర్స్‌ వైరస్‌ మరణాలను దాటేసి.. ఎబోలా మరణాల సంఖ్యకు చేరువలో నిలిచి నేను ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తుంది.

ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం మానవాళికి కొత్తేమి కాదు. గతంలో ఎన్నో మహమ్మారులతో పోరాడింది. ప్లేగు, స్మాల్‌ పాక్స్‌ వంటి ప్రమాదకర వ్యాధులను జయించింది. బ్లాక్‌ డెత్‌ (ప్లేగు) కారణంగా దాదాపు 20 కోట్ల మంది మరణించారు. మహమ్మారుల్లో ప్లేగు వ్యాధే ఎక్కువ మందిని బలిగొంది. ఎలుకల ద్వారా వచ్చిన ఈ వ్యాధి వల్ల యూరప్‌ ప్రజల్లో దాదాపు 30-40 శాతం మంది మరణించారు. ఆ తర్వాత స్మాల్‌పాక్స్‌ ప్రపంచంపై అతిపెద్ద ప్రభావం చూపించింది. స్మాల్‌పాక్స్‌తో దాదాపు 5.6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక స్పానిష్‌ ఫ్లూతో 4-5 కోట్ల మంది వరకు మృత్యువాతపడ్డారు. అయితే ఆధునిక కాలంలో కొవిడ్‌-19 అత్యంత ప్రభావం చూపిస్తుంది. 


ఎబోలాకి సమీపంలో

సార్స్‌, మెర్స్‌ వైరస్‌ మరణాల సంఖ్యను కరోనా దాటేసింది. ఈ రెండు వైరస్‌లు.. కరోనా వైరస్‌ ఉపకుటుంబానికి చెందినవి. సార్స్‌ కారణంగా 2002-03 మధ్యలో 700 మంది మరణించగా, మెర్స్‌తో ఇప్పటివరకు 850 మంది ప్రాణాలు కోల్పోయారు. మెర్స్‌ను క్యామెల్‌ ఫ్లూ అని కూడా అంటారు. అయితే కొవిడ్‌-19 ఎబోలా వైరస్‌ కంటే ప్రమాదకరంగా మారుతోంది. ఎబోలాను మొదటిసారిగా 1976లో గుర్తించారు. దీని తీవ్రత పశ్చిమ ఆఫ్రికాపై అధికంగా ఏర్పడింది. ఎబోలాతో 11,300 మంది మరణించగా ఆ సంఖ్యకు కొవిడ్‌-19 చేరువైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని