ఏపీలో పది పరీక్షలు వాయిదా

తాజా వార్తలు

Updated : 24/03/2020 14:49 IST

ఏపీలో పది పరీక్షలు వాయిదా

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏడుగురు కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలు మళ్లీ ఎప్పడు నిర్వహించేది మార్చి 31 తర్వాత తాజా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఎంసెట్‌, ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువుతేదీని పొడిగిస్తున్నట్టు మంత్రి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని