తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 25/03/2020 00:42 IST

తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు


 

హైదరాబాద్‌: ఎన్నిచర్యలు చేపట్టినా కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 39కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇద్దరు కరోనా బాధితుల్లో భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన 57 వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. బాధితుడు భద్రాద్రి జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన యువకుడి కుటుంబ సభ్యుడిగా గుర్తించారు. యువకుడి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మరో వృద్ధురాలికి సైతం కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్‌ కరోనా పాజిటివ్‌ కేసులు ఐదుకు చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని