మూడో దశకు చేరకుండా ప్రత్యేక దృష్టి:హరీశ్‌

తాజా వార్తలు

Published : 27/03/2020 00:30 IST

మూడో దశకు చేరకుండా ప్రత్యేక దృష్టి:హరీశ్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యాన్ని రేపటి నుంచి పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేషన్‌ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వారంరోజుల పాటు బియ్యం పంపిణీ కొనసాగిస్తామని హరీశ్‌ స్పష్టం చేశారు.ఈ-కుబేర్‌ ద్వారా ప్రతి రేషన్‌కార్డు లబ్ధిదారుని ఖాతాలో రూ.1500 నేరుగా జమ చేస్తామని.. ఏప్రిల్‌ 1 నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రైతుల నుంచి జంట నగరాలకు కూరగాయలు సరఫరా చేసేందుకు పాసులు అందజేస్తామన్నారు. నిత్యావసర వస్తువులు జంట నగరాలకు చేరేలా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌కు నిత్యావసరాలు, కూరగాయలు తీసుకెళ్లే వాహనాలకు బోర్డులు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు సూచించారు. బోర్డులు ఉన్న వాహనాలను ఇబ్బంది లేకుండా అనుతిస్తారని చెప్పారు. ప్రజలు బయటకు వచ్చినపుడు వారానికి సరిపడా సరకులు తీసుకెళ్లాలని సూచించారు. కరోనా నివారణకు ఇళ్లలో ఉండటమే ఏకైక మార్గమన్నారు. కరోనా ప్రభావంతో మార్చిలో రూ.2,500 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఆదాయం తగ్గినా ప్రజలకు నిత్యావసర వస్తులు, నగదు బదిలీ చేస్తామన్నారు. కరోనా మూడో దశకు చేరుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని