గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి

తాజా వార్తలు

Updated : 01/04/2020 21:28 IST

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ బారిన పడిన మరో వ్యక్తి మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7కి చేరింది.

మరోవైపు గాంధీ ఆస్పత్రిలో రోగి మృతిని నిర్ధారించిన అనంతరం అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు తీవ్ర ఆగ్రహానికి గురై వైద్యులపై దాడి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ చెప్పారు. ఈ విషయాన్ని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. సీపీ అంజనీకుమార్‌ వచ్చిన తర్వాతే పోలీసుల్లో చలనం వచ్చిందని ఆయన ఆరోపించారు. క్లిష్టపరిస్థితుల్లో వైద్యులపై దాడి సరికాదని.. ఈ ఘటనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. వైద్యుల విషయంలో రోగులు సంయమనంతో వ్యవహరించాలని శ్రవణ్‌ విజ్ఞప్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన రోగితో పాటు ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతని సోదరుడు ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చినట్లు సమాచారం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని