పట్టీ రూపంలో కరోనా టీకా

తాజా వార్తలు

Updated : 04/04/2020 06:55 IST

పట్టీ రూపంలో కరోనా టీకా

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను నిరోధించే ఒక టీకాను అమెరికా పరిశోధకులు రూపొందించారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఇది వేలి ముద్ర పరిమాణంలో ఉన్న ఒక పట్టీలా ఉంటుంది. ఇది నేరుగా టీకాను ప్రవేశపెడుతుంది.  ఈ టీకాకు పిట్‌కోవాక్‌ (పిట్స్‌బర్గ్‌ కరోనావైరస్‌ వ్యాక్సిన్‌) అని పేరుపెట్టారు. దీన్ని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పట్టీని ఎలుకలపై ప్రయోగించినప్పుడు వాటిలోని రోగ నిరోధక వ్యవస్థ.. కరోనా వైరస్‌ను నాశనం చేసే నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయి. రెండు వారాల్లోనే వీటి సంఖ్య భారీగా పెరిగాయి. ఈ వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ అనే నిర్దిష్ట భాగం ఆధారంగా దీన్ని తయారుచేసినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇంజెక్షన్‌ రూపంలో కాకుండా పట్టీ ద్వారా దీన్ని శరీరంలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల టీకా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. పట్టీలో దాదాపు 400 సూక్ష్మసూదులు ఉంటాయి. ఇవి స్పైక్‌ ప్రొటీన్‌ భాగాలను చర్మంలోకి ప్రవేశపెడతాయి. చర్మంలో శరీర రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన బలంగా ఉంటుంది. ఈ పట్టీని ఒంటిపై అతికించినప్పుడు నొప్పి ఉండదు. ఈ టీకాను సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చు. చల్లబరచాల్సిన అవసరం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని