తెలంగాణలో 272కి చేరిన కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 04/04/2020 22:05 IST

తెలంగాణలో 272కి చేరిన కరోనా కేసులు

హైదరాబాద్‌: ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా తెలంగాణలో అర్రులు చాస్తోంది. ఇవాళ మరో 43 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 272కి చేరింది. కరోనా నయమైన ఒకరిని ఇవాళ డిశ్చార్జి చేశామని, దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 33కి చేరిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 228 చికిత్స పొందుతుండగా.. 11 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల చెప్పారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మరో రెండు రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ల్యాబుల్లో 24 గంటల పాటు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఐదు లక్షల ఎన్-95 మాస్క్‌లు, 5 లక్షల ఐపీఈ కిట్‌లు, 5 లక్షల వైరల్ ట్రాన్స్‌మిషన్‌ కిట్‌లు, 500 వెంటిలేటర్లు, 4 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్క్‌లు, 25 లక్షల హాండ్ గ్లౌస్‌లు కొనుగోలు చేసినట్టు ఈటల చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల నమోదైన పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారిని కలిసిన వారివిగా నిర్ధారించినట్లు మంత్రి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని