కేరళ హైకోర్టును ఆశ్రయించిన జంతు ప్రేమికుడు

తాజా వార్తలు

Published : 06/04/2020 23:20 IST

కేరళ హైకోర్టును ఆశ్రయించిన జంతు ప్రేమికుడు

కొచ్చి (కేరళ) : కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ నేపథ్యంలో మనుషులే కాదు పెంపుడు జంతువులకూ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన  ఓ జంతు ప్రేమికుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఎన్‌.ప్రకాశ్‌ అనే వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. కాగా, తన పిల్లులకు పెట్టే ఆహారం అయిపోవడంతో.. ఆహారం దొరికే కొచ్చి పెట్స్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి కోసం ఈ నెల 4న ఆన్‌లైన్‌లో వెహికల్‌ పాసుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. దీంతో ప్రకాశ్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ‘ఈ పిల్లులు మియే పెర్షియన్‌ ఆహారాన్ని మాత్రమే తింటాయని.. తాను శాకాహారిని కావడంతో మాంసాహారాన్ని వండడంలేదని’ ప్రకాశ్‌ పిటిషన్‌లో తెలిపారు. యానిమల్‌ యాక్టు  ప్రకారం జంతువులు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఈ  పిటిషన్‌లో పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని