కేటీఆర్‌ ఎంతో మెచ్చిన ఫొటో ఇది!

తాజా వార్తలు

Published : 12/04/2020 15:30 IST

కేటీఆర్‌ ఎంతో మెచ్చిన ఫొటో ఇది!

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడికి దేశమంతా ఒకేతాటిపై నడుస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరాల కోసం బయటికి వచ్చినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుకాణాల వద్ద కూడా కొన్ని మీటర్ల దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ ఫొటో మంత్రి కేటీఆర్‌ మనసును ఆకట్టుకుంది. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన బాక్సుల్లో నిల్చున్నారు. లోకం తెలియని వీరు కూడా సామాజిక దూరం పాటించడంతో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దీన్ని కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ వారంలో నాకు ఎంతో నచ్చిన ఫొటో ఇది. ఈ ముద్దులొలికే చిన్నారులు పెద్దలకు సామాజిక దూరం గురించి నేర్పిస్తున్నారు’ అంటూ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ ఫొటోను చాలా మంది లైక్‌ చేశారు. తమకు ఎదురైన అనుభవాలను షేర్‌ చేశారు. ‘మార్కెట్‌ దగ్గర పెద్దలే దూరం పాటించడం లేదు, పెద్దలకంటే పిల్లలే మేలు, స్వీట్‌, సూపర్‌, తర్వాతి జనరేషన్‌ స్ఫూర్తినిస్తోంది..’ అంటూ కామెంట్లు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని