వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: ఈటల

తాజా వార్తలు

Updated : 18/04/2020 14:44 IST

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: ఈటల

హైదరాబాద్‌: టీఎన్‌జీవో ఆధ్వర్యంలో నారాయణగూడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. దాదాపు 200 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..‘‘ కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని నాకు ఏ దేవుడూ లేడు. వైద్యుడే దేవుడు అన్నారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు దాడి చేస్తున్నారు. వైద్యులపై దాడిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వైద్యులు.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం కొరత వల్ల ఇబ్బందిపడుతున్నారు. రక్తం కొరత రాకుండా రక్తదానానికి ప్రజలు ముందుకు రావాలి. విపత్కర సమయంలో 200 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం హర్షణీయం’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని