కరోనాపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి: కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 18/04/2020 22:06 IST

కరోనాపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా నియంత్రణ పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా కట్టడి, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు తీరుపై మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై వీరితో చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉందని.. యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంతమందికైనా పరీక్షలు జరిపి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌ నగరంలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్కూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ బాగా జరగాలని.. ఆ ప్రాంతాల్లో ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో బయటకి రానీయొద్దని సూచించారు. కరోనా సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ కరోనా కట్టడికి వ్యూహం రూపొందించుకోవాలని అధికారులను కేసీర్‌ ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని