ఇంటింటి సర్వే నిక్కచ్చిగా చేయాలి: ఈటల

తాజా వార్తలు

Published : 21/04/2020 12:41 IST

ఇంటింటి సర్వే నిక్కచ్చిగా చేయాలి: ఈటల

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మంగళవారం పర్యటించారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నాలుగు కంటైన్‌మెంట్‌ జోన్లను మంత్రి పరిశీలించారు. మున్సిపాలిటీల్లోని సిద్ధార్థనగర్‌, మామిండ్లవాడ, కాకతీయ కాలనీలను సందర్శించారు. పలు కాలనీల్లో తిరిగి స్థానికులతో మాట్లాడారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్థానిక కౌన్సిలర్లకు మంత్రి సూచించారు.

 కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేయడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో మాట్లాడి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిక్కచ్చిగా ఇంటింటి సర్వే చేయాలని ఆశా కార్యకర్తలను ఆదేశించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆర్డీవో బెన్‌ షలోమ్‌, తహసీల్దార్‌ బావుసింగ్‌లతో చర్చించారు. కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ మాధవిలతను మంత్రి ఆదేశించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని