ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 23/04/2020 11:54 IST

ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు: చంద్రబాబు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలు ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపాలని సూచించారు. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్‌ పవిత్ర దీక్షల పరమావధి కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడాలంటూ భగవంతుడిని ప్రార్థిచాలని ముస్లిం సోదరులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని