పింఛన్లలో 25శాతం కోత ఎలా సమర్థనీయం?

తాజా వార్తలు

Published : 24/04/2020 14:21 IST

పింఛన్లలో 25శాతం కోత ఎలా సమర్థనీయం?

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో ప్రభుత్వం  50శాతం కోత విధించింది. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  పింఛనులో 50శాతానికి బదులు 25 శాతం కోత విధించనున్నట్లు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం పింఛనులో 25శాతం కోత ఎలా సమర్థనీయమో తెలపాలని స్పష్టం చేసింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

వైద్యుల భద్రతపై నివేదిక ఇవ్వండి..
 మరో వైపు కరోనా చికిత్సలు చేస్తున్న వైద్య సిబ్బందికి భద్రతపై హైకోర్టులో విచారణ జరిగింది. కొవిడ్‌ ఆసుపత్రుల వద్ద భద్రత పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించి నాలుగు కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రుల వద్ద ఎంతమంది  పోలీసులు ఉంటున్నారో తెలపాలని, రెండు వారాల్లో మరింత సమగ్రంగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని